మావోయిస్టు అగ్రనేత కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి ని జనజీవన స్రవంతిలో ఆహ్వానించాలని వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆదివారం మెట్ పల్లి డి.ఎస్.పి అడ్డూరి రాములు కోరుట్ల సీఐ సురేష్ తో కలిసి తిప్పిన తిరుపతి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
గణపతితో కేంద్ర కమిటీలో
కాగా దేవ్ జి మావోయిస్టు అగ్రనేత గణపతితో పాటు కేంద్ర కమిటీ సభ్యులలో కీలక నేతగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఛత్తీస్ గడ్ లో కీలక బాధ్యతల్లో ఉన్నట్లు సమాచారం. పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్న కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారికి నిత్యావసర సరుకులను అందజేశారు. తిప్పిరి తిరుపతి గత కొద్ది సంవత్సరాల నుండి దళంలో పనిచేస్తుండడంతో కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కోరుట్ల ఎస్ ఐ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.