మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కనక సోమేశ్వర దేవాలయంలో ఆలయ పూజారి బాల్యపల్లి. ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో శివ దీక్షలు ప్రారంభం అయ్యాయి. మండల కేంద్రానికి చెందిన సుమారు 70 మంది స్వాములు మండల దీక్ష స్వీకరించారు.
- Advertisement -
స్వాములకు ప్రభాకర్ శర్మ మాలధారణ చేశారు. అనంతరం దీక్ష పరులు కనక సోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. దీక్ష తీసుకున్న వారిలో రమేష్, సురేష్, ఎన్టీఆర్, నాగరాజు, మహేష్, కిషన్, నాగేంద్ర, నగేష్ తదితరులు ఉన్నారు.