మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రజపాలన విజయోత్సవాల సందర్భంగా నంది చౌరస్తా నుండి భరత మాత కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత మత కూడలి వద్ద ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని, ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, నియోజక అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

అనంతరం మండలంలో పలు గ్రామాలకు అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీలను అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల. పుష్పాలత నర్సయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలాల. జల్పతి రెడ్డి నాయకులు నల్ల బాపు రెడ్డి, పుండ్ర. శ్రీనివాస్ రెడ్డి,మల్లయ్య, బిసి సెల్ అధ్యక్షులు వర్థ .సురేష్,మార్కెట్ కమిటీ డెరైక్టర్ లు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.