Saturday, April 19, 2025
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Mallapur: కేసులు కొత్త కాదు: ఎమ్మెల్యే సంజయ్

Mallapur: కేసులు కొత్త కాదు: ఎమ్మెల్యే సంజయ్

భరోసా

మల్లాపూర్ మండలంలో బీ ఆర్ ఎస్ కార్యకర్తలపై అక్రమంగా, అన్యాయంగా కేసులు నమోదు చేసిన ఘటనపై బీ ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ పరామర్శించారు.

- Advertisement -

ఎన్నడూ లేని రాజకీయలు ఇవి

మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన బండి. లింగ స్వామి గౌడ్, ముద్ధం.శరత్ గౌడ్, రాఘవపేట్ గ్రామానికీ చెందిన బైరి రవి, రాకేష్ లను వారివారి స్వగృహల్లో ఎమ్మెల్యే పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్రమ కేసులకు భయపడద్దని, అండగా నేను ఉంటానని సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు నడుస్తున్నాయని, అక్రమంగా కేసులు నమోదు చేసి బి ఆర్ ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని, అక్రమంగా కేసులు చేస్తే ఊరుకునేది లేదని, కార్యకర్తలకు భరోసాగా నేను ఉంటానని అన్నారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు ఆది రెడ్డి, మల్లయ్య, జీవన్ రెడ్డి, రమేష్,లక్ష్మణ్, జేడి సుమన్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News