Friday, February 7, 2025
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Mallapur: తెలుగుప్రభ ఎఫెక్ట్, వాల్కొండ స్కూల్ సందర్శించిన డీఈవో

Mallapur: తెలుగుప్రభ ఎఫెక్ట్, వాల్కొండ స్కూల్ సందర్శించిన డీఈవో

‘ప్రభుత్వ పాఠశాలలకు ట్యాంకర్ నీళ్లే దిక్కు’ అని వాల్కొండ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యపై తెలుగుప్రభ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన వార్తకు స్పందించి, జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము వాల్గొండ పాఠశాలను సందర్శించారు. నీటి సమస్యపై పాఠశాల ఉపాధ్యాయులను, మధ్యాహ్న భోజన సిబ్బందిని, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి పాఠశాలకు ఎల్లవేళలా నీళ్లు వచ్చేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు మెరుగైన సేవలు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. డీఈఓ వెంట మండల విద్యాధికారి దామోదర్ రెడ్డి, క్యాతం . వెంకట్ రెడ్డి,మనోజ్ ,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News