మాకు నవోదయ స్కూల్ కావాలంటూ మల్లాపూర్ మండల వాసులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కృషి వలన కేంద్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాకి నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసిందని, మంజూరు కావడానికి కృషి చేసిన నిజామాబాద్ ఎంపీ పార్లమెంటు పరిధిలో పాఠశాల ఏర్పాటు చేయాలనుకోవడం 100% న్యాయమైనదని, పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వంలో విప్ గా ఉన్న మీరు అధికార బలంతో ధర్మపురి నియోజకవర్గానికి తీసుకొని వెళ్లాలని ప్రయత్నం చేయడం అన్యాయమని, కోరుట్ల నియోజకవర్గంకి రావలసిన నవోదయ విద్యాలయాన్ని రాకుండా అడ్డుకోవడం న్యాయమా అని, అవసరమైతే పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు కలిసి మరో విద్యాలయ ఏర్పాటుకు ప్రయత్నం చేయండనీ, తమ నియోజకవర్గానికి రావలసిన నవోదయ విద్యాలయం ఏర్పాటును అడ్డుకోకండని అఖిలపక్ష నాయకులు అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ తీసుకుని నవోదయ పాఠశాలను జగిత్యాల జిల్లాలో రెండవ అతిపెద్ద గ్రామీణ మండలంగా ఉన్న మల్లాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయలని కోరారు.