Monday, January 6, 2025
HomeTS జిల్లా వార్తలుఖమ్మంNelakondapalli: పణిగిరి నుంచి సాగర్ వరకు బుద్ధిస్ట్ సర్క్యూట్

Nelakondapalli: పణిగిరి నుంచి సాగర్ వరకు బుద్ధిస్ట్ సర్క్యూట్

పర్యాటక క్షేత్రం..

ఫణిగిరి నుంచి నాగార్జున్ సాగర్ వరకు బుద్ధిస్ట్ సర్క్యూట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ చేపడుతుందని పురారావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం ను రాష్ట్ర రెవిన్యూ, గృహా నిర్మాణ. సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జీ తుంబూరు దయాకర్రెడ్డి తో పాటు పురావాస్తు, టూరిజం అధికారులు మంగళవారం బౌద్ధక్షేత్రంను సందర్శించారు.

- Advertisement -

పర్యాటకులను ఆకర్షించేలా తగిన సౌకార్యలుచాడ అనే గ్రామంలో బుద్ధిస్ట్ కి పేమస్ అన్నారు. ఈ మధ్యనే అక్కడ తవ్వకాలు కూడ చేపట్టినట్లు తెలిపారు. ఇక్కడి బౌద్ధక్షేత్రంను అమరావతి తరహాలో అభివృద్ధి చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పర్యాటక హాబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

అన్ని సౌకార్యలు కల్పించి బుద్ధిస్టులు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పర్యాటకులకు అనుగుణంగా అభివృద్ధి చేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఇంజినీర్ నరసింహారావు, పర్యాటక శాఖ ఎస్ఈ. సరిత, జిల్లా అధికారి సుమన్ చక్రవర్తి, డీఈ రామకృష్ణ, మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల సీతారాములు, శాఖమూరి రమేష్, కొర్లకుంట్ల నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, బొందయ్య, వంగవీటి నాగేశ్వరరావు. బచ్చలకూరినాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ, కొడాలి గోవిందరావు, వేగినాటి లక్ష్మీనర్సయ్య, కడియాల నరేష్, యడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News