Wednesday, July 16, 2025
HomeTS జిల్లా వార్తలుKishan Reddy Comments: సీఎం రేవంత్ కోసమో కాంగ్రెస్ కోసమో పనిచేయం: కేంద్ర మంత్రి కిషన్...

Kishan Reddy Comments: సీఎం రేవంత్ కోసమో కాంగ్రెస్ కోసమో పనిచేయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

kishan Reddy: సీఎం రేవంత్ కోసమో.. కాంగ్రెస్ కోసమో కేంద్రం పనిచేయదని, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తామని, రేవంత్ పూర్తి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఫైరయ్యారు. కాగా, మెట్రో డీపీఆర్‌పై సీఎం రేవంత్‌ నిన్న బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. మెట్రోకు సంబంధించి గత వారమే డీపీఆర్ ఇచ్చారని చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో స్థానికులతో కలిసి మన్ కీ బాత్‌ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెట్రో ఫేజ్-2 కు సంబంధించి ఎల్‌అండ్‌టీ‌తో ఎంఓయూ ఉందని, అనేక విషయాలు చర్చించాల్సి ఉందన్నారు. అవేవీ చేయకుండా సీఎం రేవంత్ అలా మాట్లాడడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ALSO READ: https://teluguprabha.net/telangana-news/admissions-in-telangana-government-schools-increased/

కాగా, జూలై 1న టీబీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రేపు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. అధ్యక్షుడి ఎన్నికలో భాగంగా జాతీయ పార్టీ నాయకులు సునీల్ బన్సల్, శోభ రేపు హైదరాబాద్ రానున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే అధ్యక్షుడి రేసులో కొండా లక్ష్మణ్‌, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌, బండి సంజయ్‌ ఉన్నారు. మరోవైపు మహిళల కోటాలో డీకే అరుణ ఉంది. తమకు కూడా అవకాశం ఇవ్వాలని రామచందర్ రావు, ఆచారి కోరుతున్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణ బీజీపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. మరోవైపు అటు ఏపీలోనూ జూలై 1న రాష్ర్ట అధ్యక్షుడిని బీజేపీ ఎన్నుకోనుంది. ప్రస్తుతం దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. అయితే, ఇవాళ నిజామాబాద్‌లో పసుపు బోర్డు కేంద్రాన్ని ప్రారంభించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రావడం, అధ్యక్షుడి ఎన్నిక ఉండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

ALSO READ: https://teluguprabha.net/ap-district-news/high-tension-in-tadipatri-kethi-reddy-pedda-reddy-vs-jc-prabhakar-reddy/

అభివృద్ధి విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవని, హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి కోరినా ఫలితం లేదని కిషన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ విమర్శలు చేశారు. నిన్న పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ బహిరంగ సభలో మాట్లాడిన విషయం తెలిసిందే. ‘ప్రధాని మోడీ హైదరాబాద్‌కు ఇప్పటి వరకు ఏం ఇచ్చారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి. బెంగళూరుకు, చెన్నై, చివరికి ఏపీకి కూడా మెట్రో రైల్ ఇచ్చారు. గుజరాత్‌కు ఏకంగా బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. గుజరాత్‌కు సబర్మతి, ఢిల్లీకి యమునా, ఉత్తరప్రదేశ్‌కు గంగా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చిన కేంద్రం.. మన మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? తెలంగాణపై ఎందుకీ వివక్ష?‘ అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మెట్రో విస్తరణలో తెలంగాణ తొమ్మిదో స్థానానికి దిగజారడం కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని నిలదీశారు. నగరానికి వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వాలని కోరతామని తెలిపారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News