గిరిజన ఆశ్రమ పాఠశాల కౌటాల మండలం మొగడి దగడ్ లో కలెక్టర్ శుక్రవారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి దత్తురామ్ తో కలిసి సందర్శించిన విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు.

ప్రశ్నలు అడిగి
విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్ధ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వపరంగా వారికి అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, ఇతర వసతులను పరిశీలించారు.

అన్ని తరగతి గదులను, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాల పరిశీలన జరిపారు. స్టోర్ రూమ్ లో నిలువ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
