కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కేరమెరి మండలం లోని జంగు బాయి జాతరకు హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదివాసీ గిరిజన సంప్రదాయ చీర కట్టుతో ఆకట్టుకున్నారు.
ఎప్పుడూ చీరకట్టులో కనిపించే సీతక్క సోమవారం జంగూ బాయి ఆలయం వద్ద ఆకుపచ్చ చీర కట్టుకుని సంప్రదాయాన్ని మరోసారి చాటారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కూడా మంత్రితో అదే విధంగా చీర కట్టుకుని సంప్రదాయం గుర్తు చేశారు.
గిరిజన సంప్రదాయాలు గొప్పవి
కెరమెరి మండలంలోని జంగుబాయి జాతరకి హాజరైన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఆదివాసీ గిరిజన సంప్రదాయ చీర కట్టుతో జంగుబాయి జాతరకి హాజరై తమ సంప్రదాయాలను భక్తితో శ్రద్ధగా ఆచరించారు. సామాన్యుల వద్దకు వెళ్లి, పలకరించి, వారిలో ఒకరిగా ఆమె జాతరను ఆస్వాదించారు.
జంగుబాయి పుణ్య క్షేత్రంల స్థానిక ఆదివాసీ గిరిజన మహిళలు ధరించే గొలుసు, కడియాలు మెడకు, చేతులలో వేసుకుని ఆదివాసీల గ్రీన్ కలర్ చీర కట్టుకుని సంప్రదాయాన్ని చాటిన సీతక్కను చూసి జాతరకు వచ్చినవారు ఆశ్చర్యపోయారు.
ఆదివాసీ సాంస్కృతిక సంప్రదాయాలు చాలా గొప్పవి, వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క కోరారు.