Sunday, January 5, 2025
HomeTS జిల్లా వార్తలుకొమరంభీం ఆసిఫాబాద్Asifabad: కొమరం భీమ్ కు ఘన నివాళులు

Asifabad: కొమరం భీమ్ కు ఘన నివాళులు

నివాళి

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ లో కొమురం భీం విగ్రహాన్ని ఏఎస్పి చిత్తరంజన్ సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులను కలసి కొమరం భీమ్ మ్యూజియాన్ని సందర్శించి , గిరిజన ఆచార సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. అత్యంత మారుమూల గిరిజన ప్రజలకు కూడా పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయం అందిస్తామని తెలిపారు.

- Advertisement -

అనంతరం కేరమేరి పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ ఫైళ్లను, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News