Monday, February 24, 2025
HomeTS జిల్లా వార్తలుకొమరంభీం ఆసిఫాబాద్Asifabad: వాంకిడి శివరాత్రి జాతరకి స్పెషల్ బస్సులు

Asifabad: వాంకిడి శివరాత్రి జాతరకి స్పెషల్ బస్సులు

జాతరకు వాంకిడి రెడీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫాబాద్ డిపో ఆధ్వర్యంలో వాంకిడి జాతరకు ఆసిఫాబాద్ నుండి 3 బస్సులు, కాగజ్ నగర్ నుండి ఈస్ గామ్ 6 బస్సులు, బెల్లంపల్లి నుండి బుగ్గకు 15 బస్సులు, ఆసిఫాబాద్ నుండి నంబాలకు 4, మొత్తం 28 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

మహాలక్ష్మి స్కీం వర్తిస్తుంది
ఆసిఫాబాద్ నుండి వాంకిడికి బస్సు చార్జి పెద్దలకు 40 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలు,
కాగజ్ నగర్ నుండి ఈస్ గామ్ కు బస్సు చార్జి పెద్దలకు 30 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలు,
బెల్లంపల్లి నుండి బుగ్గ కు బస్సు చార్జి పెద్దలకు 40 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలు
ఆసిఫాబాద్ నుండి నంబాల కు బస్సు చార్జి పెద్దలకు 70 రూపాయలు, పిల్లలకు 40 రూపాయలు,
జాతరకు వెళ్ళే ప్రతి బస్సులోను మహా లక్ష్మి స్కీం వర్తిస్తుంది కనుక భక్తులందరూ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ కోరింది.

మహారాష్ట్ర నుంచి కూడా

కాకతీయుల కాలంలో నిర్మించిన ఇక్కడి ఆలయంలో శివరాత్రికి భక్తులు పోటెత్తుతారు. మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శివకేశవులను దర్శించుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం ఐదు గంటలకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి చిక్లీ నది తీరంలో రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ సమీపంలోని చిక్లీ నదీ తీరాన రెండు రోజుల పాటు జాతర జరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News