మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని కందికొండ జాతరలో పాల్గొని, లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్. రామచంద్ర నాయక్, వారి సతీమణి డాక్టర్ ప్రమీల, కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్, మహబూబాబాద్ జిల్లా.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యంత ఎత్తైన, ప్రకృతి రమణీయతకు, ఔషధ మొక్కలకు ఆలవాలమైన కందగిరి పర్వత శిఖరంపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు కఠినమైన దారుల వెంట భక్తులు కదిలిపోతుంటారు. మార్గ మధ్యంలో గుహలో వెలసిన శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని.. భగవంతుని మహత్తు అన్నట్లుగా, నిత్యం నీటితో నిండిఉండే కోనేరు నీటిని తలపై చల్లుకొని, అవకాశం ఉన్నవారు స్నానాలు చేసి లక్ష్మి నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకుంటారని ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్రనాయక్, కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్, వివేక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ టీమ్ సభ్యులు కురవి మండల కోఆర్డినేటర్ గుగులోతు శివవర్మ నాయక్, సీరోల్ మండల కోఆర్డినేటర్ విష్ణు నాయక్,డోర్నకల్ రముర్తి నాయక్, మరిపెడ వెంకన్న,వెంకటేశ్వర్లు, దంతాలపల్లి రవి, చిన్న గూడూరు శంకర్ నాయక్, నరసింహులపేట గణేష్ పాల్గొన్నారు.