Wednesday, November 13, 2024
HomeTS జిల్లా వార్తలుమహబూబాబాద్Garla: ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన

Garla: ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన

శంకుస్థాపనల్లో..

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల మండలంలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -

తొలుత 2021 వ సంవత్సరంలో సత్య నారాయణపురం గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించి పెండింగ్ లో ఉన్న 33 11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ ను పునః ప్రారంభించారు అదేవిధంగా సత్యనారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ తో కలిసి ఆయన ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు ఎస్ డిఎఫ్ నిధులు 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ముల్కనూరు శేరిపురం పోచారం సీసీ రోడ్లు కాఠమయ్య గుడి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు అధ్యక్షతన నిర్వహించిన గార్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను 21 మంది లబ్ధిదారులకు 7,20,000 వేల రూపాయలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రధాన లక్ష్యంతో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రైతులు ప్రైవేట్ దళారుల మాటలు నమ్మి మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని ధాన్యం కొనుగోలు కేంద్రంలోని రైతులందరూ తమ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం మద్దతు దర సన్నాలకు 2320 రూపాయలు దొడ్డు రకం కు 2300 రూపాయలు అదనంగా ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల ధాన్యానికి బోనస్ గా 500 రూపాయలు చెల్లిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా ఎస్ డిఎఫ్ నిధుల కింద 30 లక్షల రూపాయల వ్యయంతో మూడు సీసీ రోడ్లు కంఠమహేశ్వర స్వామి దేవాలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం పెద్దపీట వేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంగమ్మ డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ మాజీ జెడ్పిటిసి జాటోత్ ఝాన్సీ లక్ష్మి మాజీ ఎంపీపీ ఎంపిటిసి వెంకట్ లాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లు మండ రాము గౌడ్ తాళ్లపల్లి కృష్ణ గౌడ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు పిఎసిఎస్ డైరెక్టర్లు యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఆడపు వెంకటేశ్వర్లు శీలం శెట్టి ప్రవీణ్ కుమార్ గంగావత్ సునీత ఎస్సీ సెల్ జిల్లా కన్వర్ బాపనపల్లి సుందర్ మాజీ ఎంపీపీ అర్జున ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అశోక్ జిగటి వెంకన్న వ్యవసాయ అధికారి రామారావు పంచాయతీ రాజ్ డిఈ వాసు ఏఈ అనిల్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ సీఈవో వెంకటేశ్వర్లు ఏ ఈ మహేంద్ర బాబు డిఈ విజయ్ ఎస్ ఈ నరేష్ ఏడిఈ రమేష్ బాబు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గుగులోత్ శ్రీనివాస్ బన్సిలాల్ హథిరాం కోళ కుమార్ కడియం వెంకన్న పిల్లలమర్రి వీరస్వామి యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్ కే పాషా గులగట్టు లెనిన్ అఫ్జల్ షబ్బీర్ మహిళా కాంగ్రెస్ నాయకురాల్లు యనముల గంగ శారద గీత కార్మిక సంఘం నాయకులు తోడేటి విజయ రాముడు శ్రీనివాస్ కత్తి సత్యం తోడేటి సత్యం కత్తి సురేష్ మండ రవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News