గార్ల మండల కేంద్రంలోని డోర్నకల్ వెళ్లే రహదారి పక్కన దర్గా ఎదురుగా ఏర్పాటు చేసిన షబ్బీర్ ఖాన్ వెల్డింగ్ వర్క్ షాప్ ను ఇల్లేందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ప్రారంభించారు.
షాప్ యజమాని షబ్బీర్ ఎమ్మెల్యేకి పుష్పగుచ్చం అందజేసి శాలవా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత స్వశక్తితో ఉపాధి పొంది అభివృద్ధి పథంలో పయనిస్తారని తద్వారా మరికొందరికి ఉపాధి కల్పించిన వారవుతారన్నారు. అనంతరం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రజాలి బేగ్ దర్గాకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో పశువులు తిరిగి అపరిశుభ్రంగా మారుతుందని దర్గాలో పూజలు చేసేందుకు వస్తున్న భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని దర్గా పక్కనే ముస్లింల స్మశాన వాటిక ఉందని దర్గా చుట్టూరా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని జామ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండా శ్రీనివాస్ రెడ్డి భూక్య నాగేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణ మాజీ జెడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి హతిరం ఇమ్రాన్ సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కందునూరిశ్రీనివాస్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అలవాల సత్యవతి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ ఖదీర్ ఎండి రహీం అబ్జాల్ నజీర్ నరేష్ రెడ్డి సద్దాం యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్ కే యాకుబ్ పాషా యాకుబ్ పాషా నజీర్ మెహరాజ్ జాన్ ఖాన్ జామా మసీద్ ప్రెసిడెంట్ షఫీరుద్దీన్ వైస్ ప్రెసిడెంట్ రహీం ఖాన్ కోశాధికారి బుడాన్ హమీద్ మునీర్ జిలాని మౌలానా ఉన్నారు.