Friday, November 15, 2024
HomeTS జిల్లా వార్తలుమహబూబాబాద్Mahabubabad: దైవ కృప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కుట్టు మిషన్ ట్రైనింగ్

Mahabubabad: దైవ కృప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కుట్టు మిషన్ ట్రైనింగ్

మహిళలకు స్వయం ఉపాధి..

మహబూబాబాద్ మున్సిపాలిటీ 23 వార్డు కౌన్సిలర్ మార్నెని శ్రీదేవి రఘు ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణా శిబిరం రెండు నెలలు సాగింది. శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సుమారు 100 మంది మహిళలకు శిక్షణ సర్టిఫికెట్ దైవ కృప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందజేసింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్
చిట్యాల జనార్ధన్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు లోకేష్ వీరన్న పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే మంచి మనసుతో వార్డ్ కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు ఇంటి వద్ద శిక్షణా కేంద్రాలను ప్రారంభించడం హర్షనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళలు సద్వినియోగం చేసుకొని శిక్షణ పొంది ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా సంఘంలో గౌరవం పొంది ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం లభిస్తుందని తమ పిల్లలను మంచి చదువులు చదివించుకొని మంచి పౌరులుగా తీర్చిదిదుకునీ ఆర్థికంగా బలోపేతం చెందే వెసులుబాటు లభిస్తుందని తెలియజేశారు.

- Advertisement -

మహిళలు క్షణికావేశానికిలోనై అఘాయిత్యాలకు పాల్పడకుండా ఇటువంటి శిక్షణ కేంద్రాలను ఉపయోగించుకొని వారికి నచ్చిన విభాగంలో నిష్ణాతులుగా మారి మంచి పురోగించి సాధించవచ్చు అన్నారు. సమాజంలో మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎంతో పురోగతి సాధిస్తున్నారని భావితరాలకు మీరంతా ఆదర్శప్రాయం కావాలన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాలలో శిక్షణను అందించుటకు తన వంతు సహకారం అందిస్తానని బ్యాంకుల ద్వారా రుణాలు పొందుటకు మహిళలందరికీ సహకరిస్తానని తెలియజేశారు. ఈ శిక్షణ ఇస్తున్న దైవకృప స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్స్ లోకేష్ వీరన్నను వారు అభినందించి సన్మానించారు.

శిక్షణ పొందిన మహిళలు మాట్లాడుతూ వార్డ్ కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు చేసిన ఈ శిక్షణా శిబిరం తమకు ఎంతో చేయూతనిచ్చిందని, ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొంది పనిచేసుకొని తాము రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించగల స్థాయికి వచ్చామన్నారు. ఈ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసిన వార్డ్ కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘుకి, శిక్షణ అందించిన దైవ కృపా స్వచ్ఛంద సేవ సంస్థ వారికి కృతజ్ఞత తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 23 వ వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు పోలిశెట్టి సంపత్ జరుపుల బాలు టిఆర్ఎస్ నాయకులు మార్నేని కిరణ్ మహిళలు వేల్పుల నాగలక్ష్మి, గుగులోత్ పద్మ , వాణి మన్నెమ్మ రోజా స్రవంతి బిందు దివ్య లత స్వాతి సుజాత అశ్విని మాధవి భారతి ధనలక్ష్మి శ్రీలత జ్యోతి రశ్మిత జవేరియా కళ్యాణి స్నేహ మౌనిక అనూష దివ్య మానస నవ్య దేవి భారతి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News