జడ్చర్ల మున్సిపాలిటీలో పరిధిలోని కావేరమ్మపేట రోడ్డులో గల మైనార్టీ గురుకుల పాఠశాలలో వేడి నీటి గీజర్ లు పాడవడంతో విద్యార్థులు చల్లని నీటితో స్నానాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే సొంత నిధులతో నాలుగు గ్రీజర్ లను పాఠశాలకు అందజేశారు.
శనివారం పాఠశాలలో నిర్వహించిన డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్థానిక నాయకులతో కలిసి వాటిని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుష్పలత, వైస్ చైర్ పర్సన్ సారిక, కౌన్సిలర్ జ్యోతి రెడ్డి, చైతన్య చౌహన్, రాజు, శశికిరణ్, నాయకులు గంట వంశీధర్ రెడ్డి, మీనాజుద్దీన్, నిత్యానందం, బుక్క వెంకటేశం తదితరులు ఉన్నారు.