కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని జడ్చర్ల పట్టణ ప్రజలు కార్తిక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని దేవాలయాలు భక్తులతో సందడిగా నెలకొన్నాయి. జడ్చర్ల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కార్తీక్ దీపాలను వెలిగించారు. అలాగే పలు ప్రముఖ ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు.
పౌర్ణమి పురస్కరించుకొని పట్టణ ప్రజలు నోములు, సత్య నారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కావేరమ్మపేట శివాలయంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. 44వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాలలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు.