Monday, March 31, 2025
HomeTS జిల్లా వార్తలుమహబూబ్ నగర్Jadcharla: ప్రైవేట్ ఏజెన్సీకి మున్సిపాలిటీ చెత్త సేకరణ

Jadcharla: ప్రైవేట్ ఏజెన్సీకి మున్సిపాలిటీ చెత్త సేకరణ

ఇంటికి నెలకు 50 రూపాయలు

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించేందుకు సాధారణ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందిందని, అందుకుగాను పైలట్ ప్రాజెక్టు కింద 3 వార్డులు 13, 24, 26 లు ఎంపిక చేసినట్లు సమాచారం. శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత అధ్యక్షతన జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో 41 అంశాలు ఆమోదం పొందాయని అందులో ప్రతి వార్డులో సాధారణ పనులకు రూ. ఒక లక్ష కేటాయించారు. చెత్త సేకరణను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి ఇందుకుగాను నెలకు రూ. 50 చొప్పున ప్రతి ఇంటికి వసూలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం పొందింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News