Thursday, March 27, 2025
HomeTS జిల్లా వార్తలుమహబూబ్ నగర్Nagar Kurnool: పర్యాటకానికి అధిక ప్రాధాన్యత

Nagar Kurnool: పర్యాటకానికి అధిక ప్రాధాన్యత

నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నాల్లో జిల్లా కలెక్టర్ కలెక్టర్ బాదావత్ సంతోష్ చొరవ తీసుకుంటున్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ నల్లమల అడవి ప్రాంతంలోని మల్లేశ్వరం, అమరగిరి ఐలాండ్ లను టూరిజం లాంచ్ లో ప్రయాణించి పర్యటక ప్రదేశాలను కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు.

- Advertisement -

నల్లమలలో సుందర ప్రాంతాలు
కొల్లాపూర్ ప్రాంతంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో సుందరమైన పర్యాటక ప్రదేశాలను గుర్తించేందుకు టూరిజం శాఖ అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న పలు పర్యాటక ప్రదేశాలను, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి గతంలో మంత్రుల బృందం పర్యటించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహనతో పాటు, ఆహ్లాదాన్ని ఇవ్వడానికి అటవీ ప్రాంతాలతో టూరిజం ఏకో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మల్లేశ్వరం ఐలాండ్

నల్లమల్ల అడవి ప్రాంతం, కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్, మల్లేశ్వరం, అమరగిరి ఐలాండ్ ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలను కలెక్టర్ పరిశీలించారు. మల్లేశ్వరం ఐలాండ్ కూడా ఒక ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా గుర్తించబడింది. ఈ ఐలాండ్ ప్రదేశం పర్యాటకుల కోసం సందర్శనీయమైన ప్రదేశంగా ఉండటంతో, ఇక్కడ మరింత పర్యాటక సేవలు, అభివృద్ధి చేసే దిశలో ప్రణాళికలు ఉన్నాయి. ఐలాండ్ పరిసర ప్రాంతాలలో పర్యాటక భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రదేశంలో ఉండే అత్యవసర సేవలు, సౌకర్యాలను సవరించాలనీ కలెక్టర్ సూచించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు సందర్శనీయ స్థలాలను కూడా పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

అటవీ ప్రాంతాలు-శక్తి క్షేత్రాలు
జిల్లా పర్యాటక ప్రదేశాల అభివృద్ధిలో అనేక అవకాశాలు ఉన్నాయి. అవి అడవి ప్రాంతాలు, శక్తి క్షేత్రాలు, జలక్రీడలు, సాహస చర్యలు, ఆహార పర్యాటకం వంటి విభాగాలను ఒకచోట కేంద్రీకరించడం ద్వారా మరింత ఆకర్షణీయంగా మారవచ్చు అన్నారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధితో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు పర్యాటక ప్రదేశాల్లో ఉన్న ప్రజల జీవన స్థితిగతులు కూడా ఆర్థికంగా మెరుగుపడతాయని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ వెంట కొల్లాపూర్ తహసీల్దార్, విష్ణు వర్ధన్ రావు, పెంట్లవెల్లి తహసిల్దార్ జయంతి FRO చంద్రశేఖర్, టూరిజం జిల్లా అధికారి కల్వరాల నరసింహ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News