భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు కళాకారులు పలికించే భావాల్లో ఆ భగవంతున్ని సాక్షాత్కరిస్తాడని వక్తలన్నారు.
సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫోరం ప్రైడ్ ఇండియా కల్చర్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఎంవీఎస్ ఫంక్షన్ హాల్ లో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని రెండు రోజులు పాటు నిర్వహించిన నేషనల్ లెవెల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డు ఫెస్ట్ నృత్య సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు చక్కటి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ వేదాంతం రాజేశం మాస్టర్ కూచిపూడి లెజెండరీ హాజరయ్యారు. ఈ నాట్యోత్సవంలో సోమవారం తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నుండి శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, గురువు, నేషనల్ లెవెల్ డా. ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత, నాట్య విభూషణి అన్నం కల్పన శిష్య బృందం శ్రీకరి, వినుజ, ఓజస్వి, శివాళిక, అభిజ్ఞ శ్రీ, హిరణ్య, సాధిక, అలోఖి, జ్ఞాపిక ప్రవస్తి, ఆరాధ్య, గీతిక, కూచిపూడి నాట్య ప్రదర్శనలు చెశారు. వారి ప్రతిభను గుర్తించి. అవార్డుతోపాటు సర్టిఫికెట్ మెడలు, బ్యాడ్జీలు ప్రదానం చేశారు. అనంతరం గరువు అన్నం కల్పనను అవార్డ్ తో ఘనంగా సన్మానించి సత్కరించారు.