జిల్లా కలెక్టర్ స్కూల్లో పాఠాలు చెప్పి విద్యార్థులను ఆకట్టుకున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మ్యాథ్స్ లెసెన్ చెప్పి, సడన్ విజిట్ లో తన మార్కు ఆసక్తిని చాటుకోవటం విశేషం.
ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం బోధించి, పలు ప్రశ్నలు అడిగి, వారితో సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు సరైన సమాధానాలు తెలపడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
కిచెన్ ను చెక్ చేసి
పాఠశాలలోని వంటగదిని పరిశీలించి స్టోర్ రూమ్ లో ఉన్న నిత్యావసర సరుకులు పరిశీలించి, వంట పాత్రను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగాలన్నారు. విద్యార్థులకు భోజనాన్ని వడ్డించే ముందు నిర్వాహకులు చేతులు పరిశుభ్రంగా కడుక్కొని వడ్డించాలని వంటవారికి సూచించారు. సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందచేసిన కంప్యూటర్ డిజిటల్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి విద్యార్థుల హాజరు శాతం మరింత పెరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు.