చదువుల తల్లి సావిత్రి బాయి పూలే 194వ జయంతి ఉత్సవాలు సరూర్ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
సావిత్రిబాయి నిరుపమాన సేవలను నిత్యం స్మరించుకోవాల్సిన బాధ్యత ఆధునిక భారత సమాజంపైన ఉందని హెచ్ఎం అన్నారు. 1848 లో బాలికల కోసం దేశంలోనే మొదటి పాఠశాలను స్థాపించి, అసామాన్యమైన కృషి సల్పిన భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జన్మదినమైన జనవరి 3 ను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడంతో రాష్ట్రంలోని మహిళా టీచర్లు సంతోషిస్తున్నారని ఆమె అన్నారు. సావిత్రి బాయి భావాలను, ఆదర్శాలను స్మరించుకుంటూ వాటికోసం పునరంకితం కావడమే మనం వారికి అందించే నిజమైన నివాళి అన్నారు.
టీచర్లకు సన్మానం
సరూర్ నగర్ హైస్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వసంతకుమారి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆడపిల్లలు చదువుకోవడానికి ఆమె చేసిన పోరాటమే నేడు ఇంతమంది మహిళలు చదువుకొని వివిధ రంగాలలో రాణించడానికి కారణమైందని అన్నారు. ఈ సందర్బంగా సరూర్ నగర్ హైస్కూల్ మహిళా ఉపాధ్యాయులందరిని సన్మానించినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి. అరుణాదేవి, ఎస్. భాగ్యలక్ష్మి, పి. కవిత, బి. అరుణ, ఎం.వి.వి స్వర్ణలత, కె . ఉమా దేవి, పి. విజయశ్రీ, జి. మరియమ్మ, ఏ. మంజుల, ఎం. శోభారాణి, ఎం. యశోధర, కె. లలిత, రోజారామలక్ష్మి, జి. భాగ్యమ్మ, జి.పద్మ, ఏ.లలిత, ఎస్. ఇందిర, వి.సునీతా దేవి, ఎం.సుజాత, డి. రాధ, ఏ. రాధ, టీ.సాయి సరిత, ఎం. రమాదేవి, ఆర్. శేఖర్ రెడ్డి, సి.బాలనరేందర్, జి.సత్యనారాయణ, డాక్టర్ రామచంద్రుడు, ఎస్.మధుసూదన్ గౌడ్, ఎన్. నారాయణ, పి. వెంకటేష్, ఏ. భాస్కర్, పి. వెంకటేష్, ఏ. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.