Thursday, February 13, 2025
HomeTS జిల్లా వార్తలుములుగుMedaram Jatara: అర్ధరాత్రి అడవి తల్లి సేవలో సీతక్క

Medaram Jatara: అర్ధరాత్రి అడవి తల్లి సేవలో సీతక్క

మినీ జాతరలో

మినీ మేడారం జాతరను పురస్కరించుకొని అర్ధరాత్రి అడవి తల్లులను దర్శించుకున్నారు మంత్రి సీతక్క. వన దేవతలు సమ్మక్క సారలమ్మల గద్దెల మీదికి వెళ్ళి మంత్రి సీతక్క మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

గద్దె వద్ద పూజలు చేసిన అనంతరం ఆమె గిరిజనులతో కలిసి ఆడిపాడారు.

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా సర్కారు ఏర్పాట్లు చేసింది. కాగా ఏర్పాట్లను స్వయంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర నిన్న అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. రూ.5.30కోట్లతో ప్రభుత్వం జాతరకు ఏర్పాట్లు చేసింది. మేడారం వెళ్లే భక్తుల కోసం 200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుండడంతో, వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగు వద్ద జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు గదుల ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News