ఎస్ ఎల్ బీసీ టన్నెల్ వద్ద ఈ ఉదయం ప్రమాదం సంభవించింది. నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగంపై కప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఉన్న ఎడమ గట్టు కాలువ 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

4 రోజుల క్రితమే ప్రారంభమైన పనులు
ఇటీవల సొరంగం పనులు ఆపి మళ్లీ తిరిగి 4 రోజులు క్రితం పనులను ప్రారంభించారు. పైకప్పు ఊడిపడటంతో స్వల్ప గాయాలతో కొంత మంది కార్మికులు బయటపడ్డారు. వారిని అక్కడి సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా మరికొంత మంది కార్మికులు లోపల ఉన్నట్లు అధికారులు అను మానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరిన నీటిపారుదల శాఖ అధికారులు ఘటనపై వివరాలు ఆరా తీస్తున్నారు.

8 మంది ఆచూకి కోసం
ఎస్ ఎల్ బి సి ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద సమయంలో 30 మంది కార్మికులు ఉన్నారు 22 మంది కార్మికులు స్వల్ప గాయాలతో సేఫ్ గానే ఉన్నారు. 8 మంది ఆచూకీ తెలియడం లేదు. వారికోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

