కులవృత్తుల ప్రోత్సాహంతోనే కాకుండా రైతుల ఆర్థిక అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట కృషి చేస్తూ మత్స్యకారుల ఆర్థిక సంపదను పెంచుతూ రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచి గంగపుత్రులకు జీవనోపాధి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.
తలకొండపల్లి మండల కేంద్రం పరిధిలోని ఎర్రకుంట చెరువు, చంద్రధనలోని నల్లకుంట చెరువు, రాంపూర్ లోని సూర్యరావు చెరువులలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా చెరువులలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేప పిల్లలను వదిలారు. అనంతరం రాంపూర్ గ్రామంలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ మద్దతు సన్న వడ్లకు ధర రూ 2320 చెల్లించడంతో పాటు కింటల్ వడ్లకు బోనస్‌గా 500 అదనంగా చెల్లిస్తున్నామని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కులవృత్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులకు జలకళ వచ్చి అన్ని చెరువులు నిండు కుండల ఉన్నాయన్నారు. అలాగే అధిక జలపాతంతో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి అవసరాలు తీరడమే కాకుండా మత్స్య సంపద పెరిగి స్థానిక మత్స్యకారులకు మంచి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి, స్థానిక ఎమ్మార్వో నాగార్జున, డిఎఫ్ఓ పూర్ణిమ, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, రంగారెడ్డి జిల్లా మత్స్యకారుల సొసైటీ డైరెక్టర్ తిక్కల వెంకటయ్య, తలకొండపల్లి మత్స్యకార సొసైటీ అధ్యక్షులు బొల్ల యాదగిరి, మాజీ సర్పంచులు శ్యాంసుందర్ రెడ్డి, భక్కికుమార్, శ్రీనివాస చారి, మాజీ ఎంపీటీసి దాసరి యాదయ్య, సింగల్ విండో డైరెక్టర్ ఎండి నయీముద్దీన్, రాంపూర్ రెడ్డి సంఘం అధ్యక్షులు చిన్న హరి మోహన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు చిన్న హరిమోహన్ రెడ్డి, నాయకులు కాకి కృష్ణ, తిరుపతి రెడ్డి, గ్రామ సొసైటి ఉపాధ్యక్షుడు సప్పడి సత్యయ్య, ప్రదాన కార్యదర్శి కావలి మహేష్ మరియు డైరెక్టర్లు, సొసైటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు, ముదిరాజ్ సంఘం నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.