Tuesday, January 7, 2025
HomeTS జిల్లా వార్తలునల్గొండChityala: డ్రైవర్ ల చేతుల్లోనే రోడ్డు యాక్సిడెంట్స్..

Chityala: డ్రైవర్ ల చేతుల్లోనే రోడ్డు యాక్సిడెంట్స్..

డ్రైవర్లూ పారా హుషార్..

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్లు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం, వట్టిమర్తి వద్ద ఉన్న డూన్ పంజాబీ ధాబాలో రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా డ్రైవర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత దేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రతిరోజు 70 నుండి 80 వేల వాహనాలు తిరుగుతాయని ఈ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు మొట్టమొదటిసారిగా ఎవరు చేపట్టని విధంగా వినూత్నంగా డ్రైవర్లకు దాబాలోనే కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా దృష్టిలోపం ఉన్నట్లయితే తక్షణమే అద్దాలు ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం, పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నదని, ఇందుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్పీ శరత్ చంద్ర పవార్ లని అభినందించారు.

రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, కుటుంబాలు వీధిన పడతాయని, ప్రాణాలు కాపాడే ఒక మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. రహదారులపై ప్రమాదాలు తగ్గించే బాధ్యత డ్రైవర్ల చేతుల్లోనే ఉందనీ చిట్యాల, నార్కట్పల్లి పరిధిలో ఎక్కువ ప్రమాదాలు జరిగేందుకు యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయని, విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా మార్చేందుకు మే చివరినాటికి టెండర్లు పూర్తిచేసి పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు సంవత్సరాలలో ఆరు లైన్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. కోదాడ, మిర్యాలగూడలలో సైతం ఇలాంటి ఉచిత కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ లారీ డ్రైవర్లు దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తూ గంటల తరబడి వాహనాలు నడుపుతుంటారని, సమయం లేకపోవడం, అలాగే సరైన పరీక్షలు నిర్వహించుకోనేందుకు అవకాశాలు లేకపోవడం ,డబ్బు లేకపోవడం వంటి కారణాలవల్ల డ్రైవర్లు దృష్టిలోపంతో వాహనాలు నడిపినప్పుడు ప్రమాదాలు జరుగుతాయని ,దీనివల్ల డ్రైవర్ల ప్రాణాలతో పాటు, ఇతర ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలను నివారించి వారి ప్రాణాలు కాపాడేందుకు, అలాగే ప్రజల ప్రాణాలను రక్షించేందుకు వట్టిమర్తి వద్ద లారీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహన డ్రైవర్లు, దూర ప్రాంతాల నుండి వచ్చే వారి ఉపయోగార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. డ్రైవర్ల దృష్టిని పెంచడం వలన ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు. 2023 లో నల్గొండ జిల్లాలో 58 హాట్స్పాట్ కేంద్రాలు ఉండగా, ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల వాటిలో 17 తగ్గించామని, ఈ సంవత్సరం మరింత పటిష్టంగా కృషిచేసి రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ డ్రైవర్ లకి ఉచిత కంటి వైద్య పరీక్షల వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు.

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగేవని, వీటన్నింటిపై కేంద్రమంత్రితో చర్చించి బ్లాక్ స్పాట్ ను గుర్తించి ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా మార్చడమే కాకుండా, పనులను ప్రత్యేకించి బ్లాక్ స్పాట్స్ను మూసివేసే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు.

జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆర్టీవో లావణ్య, ఆర్డిఓ అశోక్ రెడ్డి, డిఎస్పి శివరాం రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటి రెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్వో జీ కృష్ణనాయక్, ఆర్ ఐ లు జానీ షరీఫ్, అమర్ నాథ్ రెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్ కాటం వెంకన్న, చిట్యాల మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనరసింహ, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ రెముడాల లింగస్వామి, నాయకులు జడల చిన్న మల్లయ్య, ఎద్దులపురి కృష్ణ, ఏర్పుల పరమేష్, అంతటి నరసింహ గౌడ్, కోనేటి యాదగిరి, మారగొని ఆంజనేయులు గౌడ్, ఆవుల యాదయ్య, మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్, జమాన్ల శ్రీనివాస్ రెడ్డి, జీట్ట చంద్రకాంత్ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News