వస్తువుల కొనుగోలు ఆఫర్లు ప్రకటిస్తారు. పండుగల సీజన్లో డిస్కౌంట్ ప్రకటిస్తారు. దుస్తుల కొనుగోళ్లకు డిస్కౌంట్లు ప్రకటిస్తారు. కానీ మిర్యాలగూడలో మాత్రం ఓ ఆసుపత్రి వైద్యులకు ఫీజు రాయితీ బంపర్ ఆఫర్ సౌకర్యం కల్పించింది. దాంతో ఆసుపత్రి కిటకిటలాడుతుంది.
మిర్యాలగూడలోని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆరు రోజులపాటు భారీ ఫీజు రాయితీతో నరాల వైద్య శిబిరాన్ని నిర్వాహకులు నిర్వహిస్తున్నారు.
వైద్య శిబిరంలో 199 రూపాయలకే అన్నీ
డిసెంబర్ రెండో తేదీ నుండి ఏడో తేదీ వరకు ఈ వైద్య శిబిరం కొనసాగుతుంది. ఆరు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వచ్చే రోగులకు ఫీజులో రాయితీ కల్పించారు. మంగళవారం రెండో రోజు మిర్యాలగూడ పట్టణం తో పాటు పరిసర ప్రాంత ప్రజలు రోగులు భారీగా తరలివచ్చారు. కేవలం రూ 199 లకే డాక్టర్ ఫీజుతో సహా అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీనియర్ న్యూరో ఫిజీషియన్ శ్యామ్ జె ఆర్ సి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం కొనసాగుతుంది. రూ 199 డాక్టర్ ఫీజుతో సహా నరాల పరీక్ష, మూత్ర పరీక్ష, షుగర్ పరీక్ష రెండు పర్యాయాలు నిర్వహిస్తున్నారు.