హైదరాబాదులోని జలసౌదాలో జరిగిన పార్లమెంటరీ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నీటి పారుదల శాఖ సిఈ అజయ్ లు ఈఈ లక్ష్మణ్ బాబుపై ఫిర్యాదు చేశారు. ఎత్తిపోతల పథకాల పనులలో అలసత్వం, స్థానికంగా అందుబాటులో ఉండకుండా నీటిపారుదల వ్యవహారంపై లక్ష్మణ్ బాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రి దృష్టికి తీసుకుపోవటంతో వెంటనే స్పందించి సస్పెండ్ చేశారు.