Wednesday, February 12, 2025
HomeTS జిల్లా వార్తలునల్గొండNarkatpally: వేణుగోపాల స్వామి చెంతకు కృష్ణమ్మ: మంత్రి కోమటిరెడ్డి

Narkatpally: వేణుగోపాల స్వామి చెంతకు కృష్ణమ్మ: మంత్రి కోమటిరెడ్డి

స్వామి సేవలో..

నార్కట్పల్లి మండలం గోపలాయపల్లి గ్రామం పరిధిలోని గోవర్ధన కొండపై వెలసిన స్వయంభు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి తిరు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

- Advertisement -

పల్లకి మోసిన మంత్రి కోమటిరెడ్డి

వార్షిక బ్రహ్మోత్సవాలలో బాగంగా రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, రంగురంగు పుష్పాలతో అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం మత్స్యగిరి స్వామి అర్చకతత్వంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సుప్రభాత సేవ, ఆరాధన నివేదనలతో పల్లకిలో ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చి, కళ్యాణ క్రతుని పూర్తి చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని స్వయంగా స్వామి వారి పల్లకి మోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేలాదిగా పాల్గొని గోవింద నామ స్మరణతో స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని చూసి పునీతులయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

బంగారు కొండగా నల్లగొండ

అనంతరం మంత్రి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంపై వేణుగోపాల స్వామి ఆశీస్సులు ఉండాలని రాబోయే రోజుల్లో దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, చెరువుగట్టు ఆలయ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని త్వరలో పనులు ప్రారంబిస్తామని, ఈ ఆలయానికి కూత వేటు దూరంలోనే బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నదని, నాడు వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఎల్.బీ.సీ సొరంగాన్ని మంజూరు చేయించినట్టు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి సహకారంతో ఎస్.ఎల్.బీ.సీ సొరంగం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణమ్మను వేణుగోపాలస్వామి చెంతకు చేరుస్తామన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో ఎస్.ఎల్.బీ.సీ సొరంగం పూర్తి చేసి నల్లగొండను బంగారు కొండగా మారుస్తానన్నారు. ప్రతీ ఎకరాకు నీళ్లిస్తాం, ప్రతీ ఇంటికి త్రాగునీళ్లిస్తామని మంత్రి తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఆర్టీవో డిప్యూటీ కమిషనర్ అనిత, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ సుమతి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అంబటి నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవీందర్, నార్కట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య, చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ ఐతరాజు యాదయ్య, చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, నాయకులు పందిరి రమేష్, గార్లపాటి రవీందర్ రెడ్డి, కందిమల్ల శిశుపాల్ రెడ్డి, నేతకాని కృష్ణ, పాశం శ్రీనివాస్ రెడ్డి,వడ్డే భూపాల్ రెడ్డి,మాద లింగస్వామి గౌడ్, గడుసు శశిధర్ రెడ్డి, చెరుకు యాదగిరి, యానాల రామ్ రెడ్డి ప్రజ్ఞాపురం సత్యనారాయణ దోర్నాల రామచంద్రం, జమాన్ల శ్రీనివాసరెడ్డి, జగనీ బిక్షం రెడ్డి, మెట్టు మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News