Saturday, July 12, 2025
HomeTS జిల్లా వార్తలుPJR FlyOver: నేటి నుంచి అందుబాటులోకి పీజేఆర్ ఫ్లైఓవర్: ప్రారంభించనున్న సీఎం రేవంత్

PJR FlyOver: నేటి నుంచి అందుబాటులోకి పీజేఆర్ ఫ్లైఓవర్: ప్రారంభించనున్న సీఎం రేవంత్

PJR flyOver: రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన పీజేఆర్ ఫ్లై ఓవర్ నేటి నుంచి నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఫై ఓవర్‌ను నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ప్రజలకు ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరునుంది. ఇక ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రుయ్ అని తమ ఇళ్లకు, ఆఫీసులకు చేరుకోవచ్చు.


వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం‌లో భాగంగా ఈ ఫ్లైఓవర్‌ను రూ. 182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 1.2 కిలో మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్‌ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన మూడవ-స్థాయి నిర్మాణం ఈ ఫ్లై ఓవర్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ ఉండగా, దాని పైన శిల్పా లేఅవుట్ ఫేజ్ –1 ఫ్లైఓవర్ ఉంది. ఇప్పుడు ఆ రెండు ఫ్లై ఓవర్ల‌పైన పీజెఆర్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించారు.



హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎస్ఆర్‌డీపీ పథకం పునాది వేసిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ ద్వారా 23వ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన 42 పనుల్లో ఈ ఫ్లైఓవర్‌తో కలిపి 37 పనులు పూర్తయ్యాయి. ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, శాస్త్రిపురం ఆర్ఓబీ పనుల రైల్వే భాగాన్ని రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ లక్ష్యంగా పెట్టుకుని రైల్వే అధికారులను కోరారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/bjp-leader-amith-sha-visit-to-telangana/

జూలై చివరి నాటికి ఫలక్‌నుమా ఆర్ఓబీ పనులను, ఆగస్టు చివరి నాటికి శాస్త్రిపురం ఆర్ఓబీ పనులను పూర్తి చేయాలని కమిషనర్ వారికి లక్ష్యంగా నిర్దేశించారు. ఈ రెండు ఆర్ఓబీలు పూర్తయితే, 39 ఎస్ఆర్ డీపీ పధకం కింద చేపట్టిన పనులు పూర్తవుతాయి. వాహనదారులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణించవచ్చు.

ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/tv-anchor-swetcha-sucide-in-her-home/

ఈ ఫ్లై ఓవర్ వల్ల ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాలకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తప్పనుంది. ఇది హైటెక్ సిటీ , ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా గమ్యస్థానాలను వేగంగా చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఫైఓవర్ అందుబాటులోకి రావడంతో కొండాపూర్ ప్రాంతం నుంచి, శంషాబాద్ విమానాశ్రయం అక్కడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు గచ్చిబౌలి వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్‌ లేకుండా రుయ్ రుయ్ అంంటూ చేరుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News