Purnachandar Wife Swapna: ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న తాజాగా స్పందించారు. తన భర్త పూర్ణచందర్ అమాయకుడని, నిర్దోషి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రెండు రోజుల క్రితం స్వేచ్ఛ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి పూర్ణచందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
సోమవారం ఉదయం పూర్ణచందర్ భార్య స్వప్న మీడియాతో మాట్లాడారు. తన భర్త పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందని పేర్కొన్నారు. అయితే, వారిద్దరి రిలేషన్ గురించి తనకు తెలియదని, వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని స్వప్ణ తెలిపారు. పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు. అరణ్యను సొంత కూతురిలా చూసుకున్నాడని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ తనను మానసికంగా హింసించిందని, స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిందని స్వప్న సంచలన ఆరోపణలు చేశారు. తన పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని స్వేచ్ఛ భయపెట్టిందన్నారు. అయితే, తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమేరకు పూర్ణచందర్‌పై పోక్సో కేసును కూడా పోలీసులు నమోదు చేశారు. శనివారం రాత్రి పూర్ణచందర్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ప్రస్తుతం పూర్ణచందర్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/bhairavam-actress-aditi-shankar-looks-elegant-in-latest-insta-photos-gone-viral/
యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్వేచ్ఛ జీవితంలో జరిగిన విషాద కోణాలను, స్వేచ్ఛతో ఉన్న సంబంధాన్ని వివరిస్తూ పూర్ణచందర్ శనివారం రాత్రి బహిరంగ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. తనపై వస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఆపడానికే ఈ నిజాలు చెప్పాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. స్వేచ్చ 2009 నుంచి తనకు తెలుసని.. ఓ ప్రముఖ న్యూస్ చానెల్లో పనిచేసినప్పుడు తాము ఇద్దరం మంచి స్నేహితులమని తెలిపారు. ఈ క్రమంలో స్వేచ్ఛ తన వ్యక్తిగత విషయాలను పంచుకునేదని గుర్తుచేసుకున్నారు. 2020 నుండి తమ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. ఆ మాట వాస్తవమే అని అయిన అంగీకరించారు. అయితే విడాకుల తర్వాత స్వేచ్చ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిందని.. ఆ సమయంలో స్వేచ్ఛకు తాను అండగా నిలిచానని వివరించారు. స్వేచ్ఛ తీవ్ర మనోవేదనకు ఆమె తల్లిదండ్రులే ప్రధాన కారణమని పూర్ణచందర్ తన లేఖలో ఆరోపించారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/massive-explosion-at-patancheru-industrial-estate/
పూర్ణచందర్ న్యాయవాది ఈఘటనపై మాట్లాడుతూ స్వేచ్ఛ చనిపోవాలని పూర్ణచందర్ ఏ రోజు అనుకోలేదని.. స్వేచ్చ కుమార్తెను పూర్ణచందర్ సొంత బిడ్డగా చూసుకున్నాడన్నారు. లేఖలో పూర్ణచందర్ రాసింది వంద శాతం నిజమని.. తన వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని పూర్ణచందర్ చెప్పారన్నారు. స్వేచ్ఛ చివరి చూపుకి రాకపోవడానికి ప్రధాన కారణం తాను అక్కడికి వస్తే తన మీద దాడి చేస్తారేమోనని భయపడ్డారన్నారు. పూర్ణచందర్‌కు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నామని మీడియాతో తెలిపారు.