Saturday, July 12, 2025
HomeTS జిల్లా వార్తలుTBJP President: కార్యకర్తలే నిజమైన సారథులు: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

TBJP President: కార్యకర్తలే నిజమైన సారథులు: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

Ramchander Rao: తాను పేరుకే అధ్యక్షుడినని, తాను ఎన్నటికీ బీజేపీ కార్యకర్తనే అని, మీ సేవకుడినే అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. మంగళవారం బీజేపీ   రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన సభలో మాట్లాడారు. కార్యకర్తలే ఈ పార్టీకి నిజమైన సారథులు అని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో జనసంఘ్ అభ్యర్ధి పోటీచేస్తే వెయ్యి ఓట్లు మాత్రమే వచ్చాయని, కమ్యూనిస్టు పార్టీ గెలిచిందని గుర్తు చేశారు. ఆనాడు జనసంఘ్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు టపాసులు కాల్చారని, ఇదేందని కమ్యూనిస్టులు అడిగితే గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని సంబురాలు చేసుకుంటున్నామని చెప్పారన్నారు.

- Advertisement -

ఇవాళ అదే ఉత్సాహంతో తెలంగాణలో 8 ఎమ్మెల్యే, 8 ఎంపీ, 3 ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకున్నామని గుర్తు చేశారు. పార్టీ కోసం సైకిల్‌పై రాష్ట్రమంతటా తిరుగుతూ ఎంతో కష్టపడ్డామని గుర్తు చేశారు. బీజేపీ ఈ స్థాయికి వచ్చిందంటే… ఎంతో మంది కార్యకర్తల, నాయకుల త్యాగాలే కారణమని రామచందర్ రావు అన్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/unexpected-incident-in-hero-ram-pothineni-room-at-rajahmundry/

కార్యకర్తల చెమట కష్టంతోనే బీజేపీ ఎదిగిందని, అందరి ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం గర్వంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు. నక్సలైట్ల తూటాలకు బలైన బీజేపీ నాయకుల బలిదానాల వల్లే పార్టీ ఈ స్థాయికి ఎదిగిందన్నారు. బీజేపీ మాస్ క్యాడర్ పార్టీ అని సిద్ధాంత బలమున్న పార్టీ అని వర్ణించారు.  కలిసికట్టుగా గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దామని రామచందర్ రావు పిలుపునిచ్చారు.

బీజేపీలో కొత్త, పాత అనే పంచాయతీ లేదని, తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన కోరాచు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుతో ఎన్నో అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/ramachandra-rao-takes-bjp-state-president-responsibilities-today-bandi-sanjay-responded-on-it/

బీఆర్ఎస్, కాంగ్రెస్ వాట్సాప్ వర్సిటీలను పెట్టుకుని ఫేక్ న్యూస్‌ను ట్రోలింగ్ చేస్తున్నాయని విమర్శించారు. మీకు దమ్ముంటే… నేరుగా ఎదురుగా పోరాడదాం రండి అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ములేని పిరికిపందలు కాబట్టే వెనుకుండి ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను క్రిమినల్ లాయర్ అని ఫేక్ న్యూస్ సూత్రధారులను బోనులో నిలబెట్టేందుకూ వెనుకాడనని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రామచందర్ రావు హెచ్చరించారు. ఇకపై తెలంగాణ ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలకు సిద్ధమని, కలిసికట్టుగా అందరితో కలిసి పనిచేస్తానని బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి బండి సంజక్ కుమార్, ఎంపీ డీకే అరుణ చేతుల మీదుగా రామచందర్ రావు నియామక పత్రం అందుకున్నారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల రాష్ర్ట పార్టీ వేడుకకు రావడం లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News