రాష్ట ప్రభుత్వం ఇటీవల కొత్తగా ప్రకటించిన చేవెళ్ల మన్సిపాలిటీలో రామన్నగూడను కలుపొద్దని ఆ గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, ఆ పార్టీ యువ నాయకులు పెద్దొళ్ల దయాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డిని హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు.
ఏమిటి లాభం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారని, వారంతా ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవిస్తున్నారని లేఖలో పేర్కొన్నామ్మన్నారు. మున్సిపాలిటీలో చేర్చితే ట్యాక్సులు పెరగడమే కాకుండా బతికేందుకు ఉపాధి పనులు కూడా లేకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి తమ గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి మినహాయించాలని గ్రామస్తులు కోరారు. రైతు కూలీల బ్రతుకులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.