కోటి రూపాయలు విలువ చేసే గంజాయి(Ganja), డ్రగ్స్ (Drugs) ను పోలీసులు షాద్ నగర్ నందిగామా మండలం, మోతుకుంటలో ప్రభుత్వ ఆమోదం పొందిన జీకే మల్టీకౌవ్ ప్రైవేట్ లిమిటేడ్ కంపెనీలో కాల్చివేశారు.
షాద్ నగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో నమోదైన 17కేసుల్లో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్‌ను డిస్పోజల్ అధికారి రంగారెడ్డి డిప్యూటి కమిషనర్ పి. దశరథ్ ఇచ్చిన ఆదేశాల మేరకు శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ కృష్ణ ప్రియ, ఏఈఎస్ శ్రీనివాసరెడ్డి , షాద్ నగర్ SHO దేవేందార్ కలిసి గంజాయిని, డ్రగ్స్‌ను డిస్పోజల్ చేశారు.
19 కేజీల గంజాయి, 3.99 కేజీల గంజాయి చాక్లెట్లు, 4.6 కేజీల క్లోరో హైడ్రేడ్, 2.07 కేజీల ఓపీఎం, 883 కేజీల ఓపీఎం అనుబంద డ్రగ్స్‌గా కాల్చి వేసిన వాటిలో ఉన్నాయి. ఈ గంజాయి, డ్రగ్స్ విలువ రూ. కోటీ ఉంటుందని అంచనా వేశారు. డ్రగ్స్‌ను కాల్చివేసిన ఎక్సైజ్ యంత్రాంగాన్ని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్ రెడ్డి అభినందించారు.
