Monday, June 23, 2025
HomeTS జిల్లా వార్తలుRappa Rappa Dailouge: పేట‌కు పాకిన రప్పా రప్పా రాజకీయం

Rappa Rappa Dailouge: పేట‌కు పాకిన రప్పా రప్పా రాజకీయం

Suryapeta Politics: పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన రప్పా రప్పా డైలాగ్ సెగలు ఏపీ రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాలకు పాకింది. అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్‌తో ఏపీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా రప్పా రప్పా డైలాగ్ సెగలు తెలంగాణకు కూడా విస్తరించాయి. మొదట బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు హాజరైన సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన రైతు మహా ధర్నాలో 2028 లో రప్పా.. రప్పా 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆదివారం సూర్యాపేటలో సైతం 2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/harish-rao-wrote-a-letter-to-minister-seetakka/
మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి సారథ్యంలో మేము రెడీ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రప్పా రప్పా 3.0 లోడింగ్..ఫ్రం సూర్యాపేట..స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలు… 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు సూర్యాపేట నుంచి శ్రీకారం చుట్టడానికి జగదీష్ అన్న సారథ్యంలో మేం రెడీ అంటూ బీఆర్ఎస్ నాయకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఫ్లెక్సిలను ఏర్పాటు చేశారు. మొన్న ఆంధ్రప్రదేశ్, నిన్న సిద్దిపేట, నేడు సూర్యాపేటలలో “2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్” అంటూ సాగుతున్న పొలిటికల్ ట్రెండింగ్ ప్రకటనలు మున్ముందు తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించేటట్లుగా కనిపిస్తున్నాయి.


ఆరడుగుల అందగాడు నిన్నటి ధర్నాలో రప్పా రప్పా అని ఫ్లెక్సీలో పెట్టుకోవడం వెనుక ఉద్దేశం ఏంటని మాజీమంత్రి హరీష్ రావు పైన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. శాంతి భద్రతల్లో ఉన్న ఈ స్టేట్‌ను రప్పా రప్పా పేరు‌తో ఫ్యాక్షన్ రాష్ట్రంగా మార్చాలని అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. రాష్ట్రం‌లో ఎవరైనా శాంతి భద్రత‌లకు విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్లకు తగిన బుద్ధి చెబుతారన్నారు. గతం‌లోనే బుద్ధి చెప్పారని మరో సారి తగిన గుణపాఠం చెబుతారని మంత్రి హెచ్చరించారు. రైతుల ఖాతాల్లో టింగు టింగు మని డబ్బులు పడుతున్నందుకా రప్పా రప్పా ఫ్లెక్సీలు అని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/mahesh-kumar-goud-sensational-comments-on-phone-tapping/
అయితే ఇటీవల ఏపీలో వైఎస్ షర్మిల సైతం జగన్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రప్పా రప్పా అంటే బాబాబ్‌ను నరికింది సరిపోలేదా అని మాజీ మంత్రి పరిటాల సునీత ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News