Wednesday, December 18, 2024
HomeTS జిల్లా వార్తలుసంగారెడ్డిSangareddy: మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రం ముసివేత

Sangareddy: మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రం ముసివేత

నిధుల లేమితో..

సంగారెడ్డి మండలం కల్పగూరు శివారులోని మొసళ్ల సంతాన వృద్ధి (ప్రత్యుత్పత్తి) కేంద్రాన్ని మూసివేశారు. అక్కడ  ఉన్న నాలుగు మకరాలను పోషించేందుకు నిధులు లేక మంజీరాలో వదిలేశామని అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

పెండింగ్ లో బిల్లులు

గతంలో ఖర్చు చేసిన బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. వీటిని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడంతో, పర్యావరణ విద్యా కేంద్రంలో అచ్చం మొసలిలా ఉన్న కళారూపాన్ని ఏర్పాటు చేశారు. మంజీర జలాశయం నిర్మాణానికి 1962లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా గుర్తించారు. అంతరించిపోతున్న వన్యప్రాణి జాబితాలో మొసలి ఉండడంతో వాటిని సంరక్షించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకోసం మంజీర సరైన ప్రదేశమని ఎంపిక చేశారు. 1978 నుంచి ఈ ప్రాంతాన్ని మొసళ్ల అభయారణ్యంగా గుర్తించారు. అటవీశాఖ ఇటీవల నిర్వహించిన గణాంకాల ప్రకారం మంజీరలో మొత్తం 580 మకరాలు ఉన్నట్లు తేల్చారు. ప్రత్యుత్పత్తి కేంద్రం మూసివేతపై అటవీశాఖ రేంజ్‌ అధికారి దేవిలాల్‌ను వివరణ కోరగా ‘పోషణకు సంబంధించి నిధుల కొరత కారణంగా, ప్రత్యుత్పత్తి కేంద్రంలోని నాలుగింటిని నదిలో విడిచిపెట్టాం. ఉన్నతాధికారులు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News