సంగారెడ్డి జిల్లాలో అమీన్‌పూర్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త శాఖ ప్రారంభించింది. అమీన్‌పూర్‌లోని సదాశివ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిప్యూటీ జోనల్ మేనేజర్ కె.ఇ. హరికృష్ణ, టీమ్ అమీన్‌పూర్ సమక్షంలో హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ జి.ఎస్.డి. ప్రసాద్ చేతుల మీదుగా అమీన్‌పూర్ బ్రాంచ్‌లో బి.ఓ.ఎం. శాఖలు ప్రారంభించింది.
దీంతో బి.ఓ.ఎం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 72 శాఖలతో విస్తరించినట్టైంది. అమీన్‌పూర్ బ్రాంచ్ అన్ని బ్యాంకింగ్ లావాదేవీలను, కస్టమర్ల నిర్దిష్ట అవసరాలను కూడా తీరుస్తుంది. జోనల్ మేనేజర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అమీన్‌పూర్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యాధునిక శాఖ స్థానిక ప్రజల బ్యాంకింగ్, ఆర్థిక అవసరాలన్నింటినీ తీర్చడానికి సాయపడుతుంద”న్నారు. అమీన్‌పూర్‌లో రిటైల్, MSME వ్యాపారానికి మంచి అవకాశం ఉన్నందున RAM, రిటైల్, MSME, మిడ్ కార్పొరేట్ యూనిట్లపై దృష్టి పెట్టాలని శాఖకు సూచించారు.
దేశంలో 2400 కంటే ఎక్కువ శాఖలతో 30 మిలియన్ల మంది వినియోగదారులకు బ్యాంకు సేవలందిస్తోందని డిప్యూటీ జోనల్ మేనేజర్ కె.ఇ. హరికృష్ణ పేర్కొన్నారు.