Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుCM Revanth Reddy: కురుమూర్తి స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కురుమూర్తి స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy| మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో రూ.110 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆయల ఘాట్ రోడ్, ఎలివేటెక్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగా ఓ ముఖ్యమంత్రి కురుమూర్తి స్వామివారిని దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దాదాపు నెల రోజుల పాటు జాతర వైభవంగా జరగనుంది.

- Advertisement -

అంతకుముందు కురుమూర్తి ఆలయానికి విచ్చేసిన రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు, అధికారులు, జిల్లా యంత్రాంగం పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనరసింహ, జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ గోవర్దన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad