Ramachander Rao TBJP President: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును అధిష్ఠానం ఎంపిక చేసింది. రాష్ర్ట అధ్యక్ష పదవి బాధ్యతలు తనకు అప్పగించడంపై రామచందర్ రావు స్పందించారు. ‘ఇంతపెద్ద బాధ్యత నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. నా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన చూసి ప్రజలు విసిగిపోయారు. బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. రాష్ర్టంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీలోని అందరి నేతలను కలుపుకొని పనిచేస్తా ’ అని రామచందర్ రావు అన్నారు.
కాగా మొదటి నుంచి అధ్యక్ష పదవిలో ఉన్న ఇతర సీనియర్ నేతలకు నిరాశే ఎదురైంది. చాలా రోజుల నుంచి మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజక్, ఎంపీ ధర్మపురి అరవింద్, కొండా లక్ష్మణ్, మరో వైపు మహిళల నుంచి డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే వీరందరినీ కాదని బీజేపీ హైకమాండ్ రామచందర్ రావుపై మొగ్గుచూపింది.
ALSO READ: https://teluguprabha.net/health-fitness/sesame-seeds-for-bone-health-and-how-to-use-it/
పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికే రాష్ర్ట అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావించింది. భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా పార్టీలో విధేయుడిగా ఉన్న రామచందర్ రావు పేరును తెరపైకి తెచ్చింది. ఈరోజు మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
అయితే, విద్యార్థి దశ నుంచే ఆరెస్సెస్‌లో పనిచేయడం రాంచందర్‌కు కలిసొచ్చింది. దీంతో ఆరెస్సెస్ పెద్దలతో పాటు కొందరు సీనియర్ నేతలు రాంచందర్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే రాంచందర్ రావును పార్టీలో క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. పార్టీలోని అన్ని వర్గాలతో సఖ్యత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అయితే పార్టీలో అందరిని కలుపుకుని ముందుకు పోతారని అధిష్టానం భావించిందని చెబుతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/pranitha-subhash-yoga-day-stills-goes-trending-on-google-today/
మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారు. అనంతరం రాంచందర్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రణాళికలు రచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాంచందర్ రావును ఎంపిక చేసినట్లు కమలం నేతలు చర్చించుకుంటున్నారు.
కాగా అటు ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. మాధవ్ ఎంపికై పార్టీ నేతలందరూ ఏకాభిప్రాయంగా ఉండడంతో అతని ఎంపిక దాదాపు పూర్తి అయినట్లే. ప్రస్తుతం మాధవ్ రాష్ర్ట ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గతంలోనూ వివిధ హోదాల్లో పార్టీ కోసం కష్టపడ్డారు. ఇతనిది విశాఖ జిల్లా.
TBJP Presedent: నా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి: టీబీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES