Wednesday, July 16, 2025
HomeTS జిల్లా వార్తలుPGECET- 2025 Results: పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

PGECET- 2025 Results: పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -

PGECET Results: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(PGECET)–2025 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మార్కులు తెలుసుకోవచ్చు. ఫలితాలను గురువారం మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్టారెడ్డి, జేఎన్టీయూహెచ్‌(జవహర్‌లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్) వీసీ కిషన్‌కుమార్‌రెడ్డి విడుదల చేశారు. కాగా, ఇటీవల పీజీ ఈసెట్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. తాజా ఇవాళ అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కాగా, ఈ ఏడాది 25,334 మంది విద్యార్థులు పీజీఈసెట్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఈనెల 16 నుంచి 19 వరకు PGECET పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

PGECET- 2025 Results: పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

టీజీ పీజీఈసెట్‌ 2025 లో అర్హత పొందిన అభ్యర్థులకు ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, బయో-మెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, జియో- ఇంజినీరింగ్ అండ్‌ జియో- ఇన్ఫర్మాటిక్స్‌ ఇలా మొత్తం 19 విభాగాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పీజీఈసెట్‌-2025 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బీఈ, బీటెక్‌, బీఫార్మసీ పాసై ఉండాలి. కాగా, తెలంగాణ పీజీ ఈసెట్‌ ప్రవేశ పరీక్షలకు మార్చి 12న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యా మండలి మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించింది.

ALSO READ: https://teluguprabha.net/business/epf-withdrawal-atm-upi-auto-settlement/

తెలంగాణలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం చైర్మన్‌ బాలకిష్టారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. కాగా, ఈనెల 6న రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్‌, పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఏడాది లాసెట్‌కు మొత్తం 57,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 45,609 మంది హాజరయ్యారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంకు 13,491 మంది చొప్పున అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News