Anchor Swetcha: న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడింది. ఓ టీవీ చానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న ఈమె శుక్రవారం రాత్రి జవహర్ నగర్‌లోని తన నివాసంలో సూసైడ్ చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఈమె తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్‌లో నివాసం ఉంటోంది. స్వేచ్ఛ తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేశారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Anchor Sucide: న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య
సంబంధిత వార్తలు | RELATED ARTICLES