వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ భద్రతా సిబ్బందిని టెన్షన్‌కు గురి చేసింది. సభ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమైన సమయంలో హెలిప్యాడ్ ప్రాంగణంలో ఓ కుక్క వచ్చింది. అప్పటికే సీఎం, ఉత్తమ్ హెలికాప్టర్‌లో కూర్చున్నారు. హెలికాప్టర్ గాల్లోకి ఎగరాల్సిన సమయంలోనే కుక్క కనిపించడంతో భద్రతా సిబ్బందికి చెమటలు పట్టాయి. ఏం చేయాలో తోచక ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో కుక్క అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.