రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు శాంతియుత నిరసన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు.
తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ తల్లి పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా ఈరోజు దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్బంగా ఉద్యమకారులను సన్మానించారు వారిలో ఆవుల వీరన్న, బస్వా రమేష్, బాశిపాక కొండయ్య ఉన్నారు.

ఒకపక్క ఆశా వర్కర్లను పోలీసులతో అరెస్టులు చేస్తూ లాఠీచార్జీలు చేస్తూ, తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ, మహిళాభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అనడానికి నీకు నోరేలా వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకో వాటిని మార్చి చరిత్రని మార్చాలనుకోవటం మూర్ఖత్వమని ఎర్రబెల్లి నిప్పులు చెరిగారు.
