Sunday, November 17, 2024
HomeTS జిల్లా వార్తలువరంగల్Warangal: వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ ఉండదు

Warangal: వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ ఉండదు

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజలు కేసీఆర్ కు అధికారమిస్తే అన్ని రంగాల్లో దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బిఆర్ఎస్ పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికలలో పార్టీని లేకుండా చేస్తారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన హనుమకొండ నయీమ్ నగర్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ ,దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -


11 నెలల ప్రజా ప్రభుత్వ పనితీరు పై ఈ నెల 19వ తేదీన హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్టేడియంలో నిర్వహించే ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో సభ ఏర్పాట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న కాళోజి కళాక్షేత్రం, తదితర కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

వరంగల్ తో నాది 32 ఏళ్ల అనుబంధం..

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని ఉద్దేశించి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… వరంగల్ నగరంతో తనకు 32 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించింది అని ఆయన గర్వంగా తెలిపారు. ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా లక్ష మంది మహిళలతో వరంగల్ లో సభను నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కెసిఆర్ కు తెలంగాణ ప్రజలు అధికారమిస్తే 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, భూముల పేరిట దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని కితాబు నిచ్చారు. 10 ఏండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి కంటే పది నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికంగానే అభివృద్ధి చేసిందని తెలిపారు. కేటీఆర్ అధికారం కోల్పోవడంతో అసహనానికి గురై ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని అన్నారు. కేటీఆర్ ఆరోపించే ఆరోపణలలో వాస్తవాలు లేవని ఆయన మాటలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని చెప్పారు. సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.
ఇందిరామహిళా శక్తి సభలో ముఖ్యంగా మహిళలను, ప్రజలను, పార్టీ కార్యకర్తలను సమళీకృతం చేయాలనేది ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా… రాణి రుద్రమదేవి ఏలిన ఖిల్లా ఓరుగల్లు జిల్లాలో మొట్ట మొదటి విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.గడిచిన 11నెలలుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తున్నాం అని వివరించారు.క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పనీతిరు ప్రజలు గమనిస్తున్నారు అని, ప్రతిపక్షం సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పటికి నిజమైన లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం చేరుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక పద్దతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని తెలిపారు.

రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కుల గణనను నిర్వహిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరంలో ప్రజలను మెప్పించామని భావించి విజయోత్సవాలు నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో వరంగల్ నగర అభివృద్ధికి అవసరమైన వరాలను సీఎం ప్రకటించబోతున్నారని తెలిపారు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్,ప్రభుత్వవిప్ రామచంద్రు నాయక్,ఎ మ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, డాక్టర్ మురళి నాయక్,మేయర్ గుండు సుధారాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, పైడాకుల అశోక్, ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి,రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్, టీపీసీసీ నాయకులు,రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News