ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల సందర్భంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ పాఠశాల విద్యార్థులతో వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన 2కె రన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పిల్లలతో మున్సిపల్ కార్యాలయం వరకు 2కె రన్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…2కె రన్ లో మైనారిటీ పాఠశాల విద్యార్థులతో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల కోసం 40 శాతం డైట్ చార్జిలు పెంచిన గొప్ప సిఎం, డిప్యూటీ సిఎం లకు విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసినారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయించామన్నారు. క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో సెట్ అయిన వారికి తన సొంత నిధులతో వారికి కావాల్సిన కిట్లను అందిస్తామన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు గత పదేళ్లలో విద్యార్థుల కోసం ఒక ఆలోచన కూడా చేయలేదు.. కానీ ప్రజా ప్రభుత్వంలో విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.
అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఏడాది కాలంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో పదేళ్లలో లేని అభివృద్ధికి నిధులు తీసుకొస్తూ ప్రజలకు అండగా ఉంటున్న నన్ను ఒకడు కండ్లు బైర్లు కమ్మి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని, గతంలో దోచుకునేందుకు వచ్చాడు.. నేడు దోచుకున్నది దాచుకునేందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అని, ఖబర్దార్ బిడ్డ మాటలు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడమని సభా ముఖంగా మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి హెచ్చరించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ అమృతవర్ణ కౌన్సిలర్లు , మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, డైరెక్టర్లు మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, పోలీసు అధికారులు మైనారిటీ స్కూల్ ప్రిన్సిపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.