Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుTiger Attack: పులి దాడిలో యువతి మృతి

Tiger Attack: పులి దాడిలో యువతి మృతి

Tiger Attack| కొమురం భీం జిల్లాలో(Komuram Bheem District) పులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం కాగజ్‌నగర్ మండల పరిధిలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మీ అనే యువతి పత్తి ఏరేందుకు పొలానికి వెళ్లింది. పనిలో ఉండగా యువతి వెనకు నుంచి పులి విచక్షణారహితంగా దాడి చేసింది.

- Advertisement -

ఈ దాడిలో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెడ భాగంలో తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి జాడను కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ఫారెస్ట్ అధికారులు పులి జాడ కోసం ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad