Friday, November 22, 2024
HomeతెలంగాణMiniste Seethakka announces Indira Sakthi week: ఇందిరా మ‌హిళా శ‌క్తి వారోత్స‌వాలు

Ministe Seethakka announces Indira Sakthi week: ఇందిరా మ‌హిళా శ‌క్తి వారోత్స‌వాలు

పల్లెల కోసం..

కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటిశ్వ‌రుల‌ను చేసే ల‌క్ష్యంతో త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌ స్ప‌ష్టం చేసారు.
ప్ర‌తి మ‌హిళ స్వ‌యం స‌హాయ‌క సంఘాల్లో చేర్చేలా అధికారులు ప్ర‌త్యేక డ్రైవ్ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ఇందిరా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కానికి సంబంధించి వారోత్సవాలు చేస్తున్న‌ట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీలేని రుణాలు ఇప్పించేలా గ్రామ గ్రామాన‌ బ్యాంక‌ర్ల‌తో స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని సూచించారు. స‌చివాలంలో శ‌నివారం నాడు డీఆర్డీఓ ల‌తో మంత్రి సీత‌క్క వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. స‌చివాల‌యంలో త‌న చాంబ‌ర్ లో పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి డి. లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవ రాజ‌న్, పీఆర్ & ఆర్డీ క‌మీష‌న‌ర్ అనితా రామ‌చంద్ర‌న్, స్పెష‌ల్ క‌మీష‌న‌ర్ బీ. ష‌ఫిఉల్లా, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్న స‌మావేశంలో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంలో బాగంగా వ‌చ్చే ఐదునెల‌ల్లో చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై జిల్లా అధికారుల‌కు దిశా నిర్దేశం చేసారు. ఉపాధి హ‌మీ ప‌థ‌కం ద్వారా కూలీల‌కు ఉపాధి క‌ల్పించ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ ప‌డే ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని సూచించారు.
గ‌డుపు నిర్దేశించుకుని ప‌నులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మార్చి లోపు ఉపాధి హామీ పనుల కోసం రూ. 1372 కోట్ల నిధులు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు చెప్పిన మంత్రి..అనుగుణంఆ డీఆర్డీఓలు కార్యాచ‌ర‌ణ సిద్దం చేయాల‌ని సూచించారు. మ‌హిళ‌ల‌కు ఉపాధి భ‌రోసా, పంట‌ పొలాల‌కు బాట‌లు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ ప‌నుల కోసం ఉపాధి నిధులు వెచ్చించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న‌రు. అయితే క్షేత్ర స్థాయిలో ప్ర‌జ‌ల అవ‌స‌రాలు, అభివృద్ది ప్రాతిప‌దిక‌న పనులను గుర్తించాల‌న్నారు. గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచి గ్రామ సభలు విధిగా నిర్వహించాల‌ని చెప్పారు. గ్రామస్తుల అభిప్రాయాలకు అనుగుణంగా ఉపాధి పనులను చేపట్టాలని కోరారు.

- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ లు లేక ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో ప్రతి ఇంటిలో టాయిలెట్ వుండేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీత‌క్క ఆదేశించారు. చెక్ డ్యాంల నిర్మాణం, పంట కాలువల్లో పూడికతీత పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరా మహిళా శక్తి ముఖ్య ఉద్దేశమ‌న్నారు. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించే ల‌క్ష్యంతో అధికారులు ప‌నిచేయాల‌న్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News