Saturday, April 12, 2025
HomeతెలంగాణKTR serious on channels: ఛానెళ్లపై కేటీఆర్ కంప్లైంట్

KTR serious on channels: ఛానెళ్లపై కేటీఆర్ కంప్లైంట్

క్రిమినల్ కేసులు పెడతాం

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయనీ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లపైన కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం ధావాలతోపాటు, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు క్రిమినల్ కేసులను కూడా నమోదు అయ్యేలా చూస్తామని ఆయన తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నామన్నారు. గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామనీ తెలిపిన కేటీఆర్, ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామనీ హెచ్చరించారు. దీంతోపాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామనీ తెలిపారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి కుట్రపూరిత చానళ్ల ప్రాపగాండా,, అసత్య ప్రచారం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News