Thursday, September 12, 2024
Homeతెలంగాణఅమెజాన్ లో కెరీర్ విస్తరణకు అవకాశాలు

అమెజాన్ లో కెరీర్ విస్తరణకు అవకాశాలు

మాజీ సైనికోద్యోగిణి సుప్రియ

మిలిటరీ నుంచి కార్పొరేట్ వైపు తన ప్రయాణం సాగిందని మాజీ సైనికోద్యోగిణి సుప్రియ అన్నారు. అమెజాన్ లో తన అనుభవాల గురించి ఆమె మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత భారత వైమానిక దళంలో చేరానని తెలిపారు. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న సమయంలోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశానన్నారు. దేశానికి మహోన్నత సేవ చేయాలనే తన సంకల్పమే తాను భారత వైమానిక దళంలో చేరేందుకు ప్రోత్సహించిందన్నారు. మానవరహిత వైమానిక వాహనాలు, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్టుల నిర్వహణలో తనకు నైపుణ్యం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పదవీ విరమణ అనంతరం అమెజాన్ మేనేజర్ – వర్క్ ప్లేస్ హెల్త్ అండ్ సేఫ్టీ విభాగంలో చేరానని పేర్కొన్నారు.

- Advertisement -

దేశంలోనే అమెజాన్ కు చెందిన అతిపెద్ద సార్టేషన్ సెంటర్లలో సిబ్బంది, పరికరాల నిర్వహణ బాధ్యతలను తీసుకున్నానని చెప్పారు. అనంతరం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ టీంకు మారానన్నారు. అక్కడ అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ నెట్వర్క్ కోసం కమ్యూనిటీ వాలంటీరింగ్ ప్రొగ్రాంలకు వ్యూహ రచన చేయడంతో పాటు మద్ధతుగా నిలిచానని చెప్పుకొచ్చాన్నారు. ప్రస్తుతం అమెజాన్ లోని సస్టైనబిలిటీ అండ్ సీఎస్ఆర్ విభాగంలో సర్టిఫైడ్ ప్రొఫెషనల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సైన్యంలో తాము విభిన్న విధులను నిర్వహిస్తామని, ఎంతో క్రమ శిక్షణతో ఉంటామన్నారు. అక్కడి అనుభవాలు అమెజాన్ లో నూతన కెరీర్ విస్తరణకు ఎంతో దోహదపడ్డాయన్నారు. అమెజాన్ లో అందుకు అనేక అవకాశాలు లభించగా వాటిని ఉపయోగించుకున్నట్లు తెలియజేశారు. తన వంటి ఎంతో మంది అమెజాన్ సంస్థలో సేవలందిస్తూ నూతన కెరీర్ ను నిర్మించుకుంటున్నారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News